టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాలో 'నాటు నాటు' అనే పాటకి ఇటీవల ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ కి చాలా సంవత్సరాల తర్వాత ఆస్కార్ అవార్డు రావడంతో చిత్ర యూనిట్ పై సినీ ప్రేక్షకులంతా ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు త్రిబుల్ టీం ని పర్సనల్గా కలిసి అభినందించడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా మరో రాజకీయ ప్రముఖుడు త్రిబుల్ ఆర్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించబోతున్నారు. 

అతనే బిజెపి అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఈయన ఇప్పుడు మన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే అమిత్ షా త్రిబుల్ ఆర్ టీమ్ ని కలవబోతున్నారు. ఇక మన భారతదేశానికి ఆస్కార్ను సాధించిన త్రిపుల్ ఆర్ టీం ని స్వయంగా అభినందించనున్నారు. అంతేకాదు చిత్ర బృందం కోసం ప్రత్యేకంగా విందు కూడా ఇవ్వబోతున్నారట. గతంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా ని విడివిడిగా కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అమిత్ షా తెలంగాణ టూర్ లో భాగంగా డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ ను ఈనెల 23వ తేదీన కలవనున్నారు.

ఇక వీళ్ళందరికీ అమిత్ షా స్వయంగా గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నారు. ఇక త్రిబుల్ ఆర్ మూవీ యూనిట్ తో పాటు రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్ కూడా ఈ ఆహ్వానం అందుకున్నట్లు సమాచారం. త్రిబుల్ ఆర్ కథను రాసింది విజయేంద్రప్రసాద్ అనే విషయం తెలిసిందే కదా. అందుకే ఆయన కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మొత్తంగా భారతీయులు కలగంటున్న ఆస్కార్ కల త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తీరడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ రాజకీయ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించడం తెలుగు సినీ పరిశ్రమకే ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: