టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందినటువంటి విరూపాక్ష అనే సస్పెన్స్ ... థ్రిల్లర్ ... హార్రర్ జోనర్  మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో వరుస విజయాలతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా ఏప్రిల్ 21 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 1.82 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ లో 54 లక్షలు ... యూ ఏ లో  58 లక్షలు ... ఈస్ట్ లో 40 లక్షలు ... వెస్ట్ లో 47 లక్షలు ... గుంటూరు లో 46 లక్షలు ... కృష్ణ లో 32 లక్షలు ... నెల్లూరు లో 20 లక్షల కలెక్షన్ లు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమా 4.79 కోట్ల షేర్ ... 8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా మొదటి రోజు 36 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ... ఓవర్ సీస్ లో 1.20 కోట్ల కలెక్షన్ లను వాసులు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: