కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రి మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్లో ఇప్పటికే అసురన్, విచారణయ్, కాకముట్టయి, వడ చెన్నై వంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజ జీవితంలో జరిగిన అంశాలను ఆడియన్స్ ని మెప్పించేలా సినిమా తీయడం ఈ దర్శకుడికి ఉన్న ప్రత్యేక శైలి. అందుకే సౌత్ లోనే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఎంతో పాపులారిటీ ఉంది. వెట్రిమోరన్ సినిమా వస్తోంది అనగానే ఆ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. ఆ సినిమాలో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరా? అని చూడరు. అది వెట్రిమారన్ సినిమా అయితే చాలు. అంతలా తన డైరెక్షన్ తో సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు ఈ దర్శకుడు. 

అలాంటి భారీ అంచనాలతో ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన 'విడుదలై పార్ట్ 1' కోలీవుడ్లో చాలా పెద్ద హిట్ గా నిలిచింది. ఇక తెలుగులో కూడా ఇటీవల ఈ సినిమా విడుదల కాగా.. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. కోలీవుడ్ మూవీస్ లో కమెడియన్ గా నవ్వించిన సూరి ఈ సినిమాలో హీరోగా నటించాడు. అలాగే కోలీవుడ్ విలక్షణ నటుడైన మక్కల్ సెల్వన్  విజయసేతుపతి సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేశాడు. ఏప్రిల్ 15న తెలుగులో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది. పలువురు సినీ ప్రముఖుల సైతం ఈ సినిమా బాగుందంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇక తెలుగులో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. కాగా అటు తమిళ్ ఆడియన్స్ ని తెలుగు ఆడియన్స్ ని థియేటర్లో ఆకట్టుకున్న విడుదల పార్ట్ వన్ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అందుకు సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జీ5 విడుదల మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైన్స్ ను సొంతం చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 28 నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు ఇదే డేట్ కి ఈ మూవీ ఓటిటి రిలీజ్ కానుందట. ఒకవేళ ఆ డేట్ కాకపోతే మే మొదటి వారంలో ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో వాసుదేవ్ మీనన్,  చేతన్, భవాని శ్రీ, ఇలవరసు, బాలాజీ శక్తివేల్ తదితరులు ఇతర కీలకపాత్రను పోషించారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: