టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. తన మొదటి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న ఈ హీరో ఒకప్పుడు తన కామెడీతో అందరినీ కడుపుబ్బ నవ్వించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. కేవలం కామెడీ సినిమాలే కాదు మధ్య మధ్యలో నేను, గమ్యం, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి సినిమాల్లో తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు.కానీ ఈ సినిమాలేవి నరేష్ కి గుర్తింపు తేలేకపోయాయి. కేవలం కామెడీ సినిమాలే అల్లరి నరేష్ కి స్టార్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి అనేది వాస్తవం. అయితే కొన్నాళ్ల తర్వాత తన తండ్రి ఈవివి సత్యనారాయణ మరణించడం, ఆ సమయంలో టీవీలో జబర్దస్త్ వంటి కామెడీ షో లు పెరిగిపోవడంతో అల్లరి నరేష్ రేస్ లో వెనుకబడ్డాడు. దీంతో అతని హిట్ పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది. 

మెల్లమెల్లగా మూవీ ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో అల్లరి నరేష్ సినిమాలు థియేటర్లోకి ఎప్పుడు వస్తున్నాయో? ఎప్పుడు వెళ్తున్నాయో? తెలియని పరిస్థితిగా మారింది. ఇలాంటి టైం లోనే అల్లరి నరేష్ తన రూట్ మార్చి సీరియస్ రోల్ చేయడానికి డిసైడ్ అయిపోయాడు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో ఓ మంచి పాత్ర పోషించాడు. మహర్షి మూవీలో అల్లరి నరేష్ పాత్ర బాగా హైలైట్ అయింది. ఆ తర్వాత 'నాంది' అనే సినిమా చేశాడు. విజయ్ కనకమేడల ఈ మూవీలో అల్లరి నరేష్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కమర్షియల్ గా నిరాశపరిచినప్పటికీ.. సినిమాలో అల్లరి నరేష్ పర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.

త్వరలో 'ఉగ్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నరేష్. ఈ సినిమాని కూడా నాంది డైరెక్టర్ విజయ్ తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా తర్వాత కింగ్ నాగార్జునతో కలిసి అల్లరి నరేష్సినిమా చేయాల్సి ఉంది. ఈలోపే ఇప్పుడు మరో సినిమాను సైన్ చేశాడట ఈ హీరో. సోలో బ్రతికే సో బెటర్ వంటి కమర్షియల్ అందుకున్న సుబ్బు డైరెక్షన్లో అల్లరి నరేష్సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమాలో నరేష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారట. ఒక విధంగా ఈ సినిమాలో నరేష్ విలన్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. ఇన్నాళ్లు తన కామెడీ తో పాటు పర్ఫామెన్స్ తో అదరగొట్టిన అల్లరి నరేష్.. ఇప్పుడు విలన్ గా ఏ మేర మెప్పిస్తాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: