టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటించిన 'రామబాణం' సినిమా తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో 'ఐఫోన్ పిల్ల' అంటూ సాగే ఓ పాట ఉంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ పాటలో నా ప్రాణం ఆగదు పిల్ల అనే లైన్ ఉంటుంది. అయితే ఈ పాట అలాగే ఈట్యూన్ నాదే అంటూ తాజాగా కరీంనగర్ కు చెందిన జానపద గాయకుడు గొల్లపల్లి రవీందర్ మీడియా ముందుకు వచ్చాడు. గత 30 ఏళ్లుగా తాను పాటలు పాడుతున్నానని, 1992లో చేతికి గాజులు పిల్లో అనే పాటను రాసానని చెప్పాడు. ఈ పాట అప్పట్లో బాగా హిట్ అయిందని.. 

ఈ పాటలోని లైన్ ని ట్యూన్ ని రామబాణం సినిమా యూనిట్ వాళ్ళు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాడుకున్నారని ఆరోపిస్తున్నాడు ఈ జానపద కళాకారుడు గొల్లపల్లి రవీందర్. మరో మూడు రోజుల్లో గా మ్యూజిక్ డైరెక్టర్ కానీ చిత్ర యూనిట్ కానీ దీనిపై తనకు వివరణ ఇవ్వలేకపోతే తాను లీగల్గా వెళ్తానని అంటున్నాడు.రిలీజ్ టైం దగ్గర పడుతున్న సమయంలో రామబాణం మూవీ ఈ పాట వివాదంలో చిక్కుకోవడం మూవీ టీం కి ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక రామబాణం సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

తాజాగా వివాదంలో చిక్కుకున్న ఐఫోన్ పిల్ల సాంగ్ ని ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ రచించగా.. సింగర్స్ రామ్ మిర్యాల, మోహన భాగరాజు ఆలపించారు. మరి ఈ వివాదం పై మ్యూజిక్ డైరెక్టర్ గాని లిరిక్ రైటర్ కానీ ఎటువంటి వివరణ ఇస్తారో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై వివేక్ కూచిపట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాని  గతంలో గోపీచంద్ తో లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించిన శ్రీవాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. శ్రీనవాస్ - గోపీచంద్ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. కంప్లీట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్గా నటించగా.. కుష్బూ, జగపతిబాబు,వెన్నెల కిషోర్, అలీ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ మే 5వ తేదీన విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: