తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటు లలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సైన్ స్క్రీన్ సంస్థ వారు నిర్మించారు. ఈ సినిమాను మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ బృందం ఈ రోజు వైజాగ్ లోని కొన్ని ప్రదేశాలను పర్యటించబోతుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ రోజు వైజాగ్ లో ఏ ప్రాంతాలను ... ఏ సమయంలో పర్యటించబోతున్నది అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ రోజు ఉగ్రం మూవీ యూనిట్ వైజాగ్ లో సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ ను నిర్వహించబోతుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు హోటల్ వీ ప్రైడ్ లో ఫ్యాన్స్ తో మీట్ ను నిర్వహించబోతుంది. ఆ తరువాత సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు "సీఎంఆర్" మాల్ ను విసిట్ చేయబోతుంది. ఇలా ఈ రోజు ఉగ్రం మూవీ యూనిట్ వైజాగ్ లో ఈ ప్రాంతాలను పర్యటించబోతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నరేష్ ... విజయ్ కాంబినేషన్ లో రూపొందిన నాంది మూవీ సూపర్ హిట్ విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందిన ఉగ్రం మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: