60 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీని శాసించిన అక్కినేని 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న అక్కినేని కుటుంబ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య అఖిల్ లు ఇప్పటికీ పూర్తిగా సెటిల్ కాకపోవడం అక్కినేని అభిమానులకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలను కూడ ఆశ్చర్య పరుస్తోంది.


నాగచైతన్య ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు దాటిపోయినా అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి 5 సంవత్సరాలు గడిచిపోయినా వీరిద్దరికీ ఇంకా స్పష్టమైన క్రేజ్ ఏర్పడలేదు అన్నది వాస్తవం. చైతన్యకు ఒక హిట్ వస్తే వరసగా 5 ఫ్లాప్ లు వస్తే అఖిల్ కు హిట్ రావడమే గగనంగా మారిపోయింది. అతడి కెరియర్ లో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ తప్ప మరే సినిమా హిట్ అని అనిపించుకొలేకపోయాయి.


నాగచైతన్య కు హిట్ వచ్చి చాలసంవత్సరాలు అవుతోంది. ‘లవ్ స్టోరీ’ ఏవరేజ్ హిట్ గా మారితే ఆతరువాత ‘ థాంక్యూ’ భయంకరమైన ఫ్లాప్ గా మారింది. అఖిల్ ఎంతో కష్టపడి నటించిన ‘ఏజెంట్’ మూవీ బయ్యర్లకు 75 శాతం పైగా నష్టాలు వస్తాయి అని అంటున్నారు. ఈసమ్మర్ రేస్ కు రావలసి ఉన్న చైతన్య నటించిన ‘కష్తడి’ మూవీ పై కూడ అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.


అమీర్ ఖాన్ తో చైతూ ఏరికోరి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఫ్లాప్ గా మారడంతో చైతూ బాలీవుడ్ ఎంట్రీ పీడకల లా మారిపోయింది. వీరిద్దరి పరిస్థితి ఇలా ఉంటే నాగార్జున పరిస్థితి కూడ మరింత అయోమయంగా ఉంది అతడు నటించిన ‘దిఘోస్ట్’ ఫ్లాప్ అవ్వడంతో నాగ్ ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం అవ్వక పోర్ర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని అంటున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పిన కథ నచ్చినప్పటికీ ఆసినిమాను మొదలుపెట్టే సాహసం నాగ్ చేయలేకపోతున్నాడు అన్న రూమర్స్ కూడ ఉన్నాయి. ఇలా రకరకాల కారణాలతో టోటల్ కన్ఫ్యూజన్ లో అక్కినేని కుటుంబ హీరోలు ఉన్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: