నిన్న అనగా ఏప్రిల్ 30 వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ ... పొన్నియన్ సెల్వన్ 2 ... విరూపాక్ష మూవీ లకు ఏ రేంజ్ షేర్ కలెక్షన్ లు దక్కాయో తెలుసుకుందాం.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ నిన్నటి తో 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.40 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష కీలక పాత్రలలో నటించగా ... ఏఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష మూవీ నిన్నటి తో 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.38 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇది ఇలా ఉంటే నిన్న అనగా ఏప్రిల్ 30 వ తేదీన ఏజెంట్ ... పొన్నియన్ సెల్వన్ 2 ... విరూపాక్ష 3 సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.21 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేశాయి.