ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కాదు గ్లోబల్ స్టార్ లాగా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయాడు అని చెప్పాలి. ప్రభాస్ కు క్రేజ్ కూడా అంతకంతకు పెరిగిపోతుంది. అయితే స్టార్ హీరో ప్రభాస్ ముద్దు పేరు ఏంటి అంటే అభిమానులు అందరూ కూడా గుక్క తిప్పుకోకుండా చెబుతారు డార్లింగ్ అని. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రభాస్ అని పిలిచే వారి కంటే ఆ హీరోని డార్లింగ్ అని పిలిచేవారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అదే కాదు ప్రభాస్ మంచి మనసుకు డార్లింగ్ అనే నిక్ నేమ్ బాగా సరిపోతుందని ఎంతోమంది అభిప్రాయపడుతూ ఉంటారు.



 అయితే ఇలా అభిమానులు తోటి నటీనటులు అందరూ కూడా అటు ప్రభాస్ ని డార్లింగ్ అని ముద్దుగా పిలిస్తే.. అటు ప్రభాస్ కు మరింత సన్నిహితురాలు అయిన హీరోయిన్ అనుష్క మాత్రం ప్రత్యేకంగా మరో ముద్దు పేరు పెట్టి పిలుస్తూ ఉంటుందట. అనుష్క, ప్రభాస్ జోడి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆన్ స్క్రీన్ లో మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరూ ఎక్కడ కనిపించినా తెగ మురిసిపోతూ ఉంటారు అభిమానులు. ఇక అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇకపోతే అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది.


 ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రభాస్ ఇక ఈ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయితే ప్రభాస్ చెప్పిన విషెస్ కు అటు అనుష్క రిప్లై ఇచ్చింది అని చెప్పాలి. థాంక్యూ పప్సు అంటూ రిప్లై ఇచ్చింది అనుష్క.  దీంతో అందరూ డార్లింగ్ అని పిలిస్తే కేవలం అనుష్క మాత్రం ప్రభాస్ ని పప్సు అని పిలుస్తుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయింది. దీంతో అనుష్క, ప్రభాస్ మధ్య ఏదో ఉందంటూ మళ్ళీ వార్తలు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: