తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరోయిన్ గా నటించిన కృతి కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా ... కొన్ని మూవీ లతో అపజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా కృతి "కస్టడీ" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో నాగ చైతన్య హీరో గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే నాగ చైతన్య ... కృతి శెట్టి కలిసి బంగార్రాజు మూవీ లో నటించారు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే వీరిద్దరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. కస్టడీ మూవీ లో అరవింద స్వామి ... ప్రియమణి కీలక పాత్రలలో నటించగా ... ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.

 ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. అందులో భాగంగా కృతి స్కై బ్లూ కలర్ లో ఉన్న పలుచోటి శారీని కట్టుకొని ... అందుకు తగిన స్కై బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి విచ్చేసింది. ఇందులో కృతి అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం కృతి శెట్టి సంబంధించిన ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: