సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీలలో హీరోగా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మహేష్ కెరియర్ లో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను కూడా అందుకున్నాయి.

అలా మహేష్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలు అందుకున్న సినిమాలలో బ్రహ్మోత్సవం మూవీ ఒకటి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , సమంత , ప్రణీత హీరోయిన్ లుగా నటించారు. మహేష్ ... శ్రీకాంత్ కాంబినేషన్ లో రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో బ్రహ్మోత్సవం సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన బ్రహ్మోత్సవం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో భారీ కలెక్షన్ లను కూడా రాబట్ట లేక పోయింది.

దానితో చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్లాప్ కావడానికి ప్రధాన కారణం ఈ సినిమా హీరో ... దర్శకుడు మరియు నిర్మాతలు ఈ సినిమాకు పూర్తి కథ రెడీ కాకముందే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకు వెళ్లారట. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఈ సినిమా కథ విషయంలో కూడా అనేక సమస్యలు తలెత్తయట. ఆ కారణంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేక పోయినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ సినిమాకు కనుక ముందే కథ సిద్ధం అయ్యి ఉంటే బ్లాక్ బస్టర్ అయి ఉండేది అని మహేష్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: