జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో ప్రియదర్శి కావ్య కళ్యాణ్రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించడం జరిగింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను అందుకుంది.దాదాపుగా ఇప్పటివరకు రూ 50 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకొని పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. అంతేకాకుండా అవార్డులు కూడా అదే రీతిలో సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


ఇటీవలే కానిస్టేబుల్ ఫలితాలలో కూడా బలగం సినిమా పైన ఒక ప్రశ్న అడగడం జరిగింది.. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా బెస్ట్ ఫిలిం బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రామా మూవీ బెస్ట్ సినిమాటోగ్రఫీ బెస్ట్ మ్యూజిక్ ఇలా అన్ని అవార్డులను కూడా అంతర్జాతీయ స్థాయిలో దక్కించుకుంది. ఇప్పుడు మరొకసారి రెండు క్యారెక్టర్లలో అవార్డుని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాది జరిగిన స్విడష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ల బెస్ట్ యాక్టర్ అవార్డుగా ప్రియదర్శిని అవార్డు అందుకున్నట్లుగా తెలుస్తోంది.


ప్రియదర్శితోపాటు ఈ సినిమాలో అతని తాత పాత్ర పోషించిన కేతిక సుధాకర్ రెడ్డి కూడా ఈ అవార్డును అందుకున్నట్లు తెలుస్తోంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో సుధాకర్ రెడ్డి అవార్డును గెలుచుకోవడంతో చిత్ర బృందం తెగ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. గతంలో 2021, 22 లో మలయాళ చిత్రాలు బెస్ట్ ఫిలిం గా స్విడష్ లో అవార్డును అందుకున్నాయి. వాటి తర్వాత ఈ లిస్టులో ఇప్పుడు బలగం సినిమా చేరి మొదటి తెలుగు సినిమాగా నిలిచింది. ఇటీవల ఈ సినిమా సంగీత దర్శకుడు బీమ్స్ సిసి రోలియో 13 వ దాదాసాహె పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డును అందుకోవడం జరిగింది. ఈ సినిమాకి 40కిపైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: