మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరో గా నటించాడు. అలా చిరంజీవి తన కెరియర్ లో నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ లలో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఒకటి. ఈ మూవీ కి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ... శ్రీదేవి ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది.

 ఇళయ రాజామూవీ కి సంగీతం అందించగా ... వైజయంతి మూవీస్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ విజయంలో ఇళయరాజా అందించిన సంగీతం అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ 9 మే 1990 వ సంవత్సరం లో విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఈ మూవీ ద్వారా చిరంజీవి ... శ్రీదేవి జంటకు ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు కు కూడా ఈ మూవీ ద్వారా సూపర్ క్రేజ్ లభించింది. ఇలా ఆ కాలంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా నేటితో 33 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: