నందమూరి నట సింహం బాలకృష్ణ వరుసగా అఖండ ... వీర సింహారెడ్డి లాంటి రెండు విజయాల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న కారణంతో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ మూవీ మేకర్స్ ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. 

ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో శ్రీ లీల కనిపించబోతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరు అయినటు వంటి అర్జున్ రాంపాల్ నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెట్స్ లోకి అర్జున్ రాంపాల్ ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అఖండ ... వీర సింహా రెడ్డి లాంటి మంచి విజయవంతమైన మూవీ ల తర్వాత బాలయ్య నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: