టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో పాన్ ఇండియా లెవెల్లో  నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల ఈ మూవీలో రామ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. బోయపాటి వంటి మాస్ డైరెక్టర్ తో రామ్ మొదటిసారి సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం రామ్ తన లుక్ పూర్తిగా మార్చేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం బరువు కూడా పెరిగాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఓ ప్రత్యేక సెట్ లో రామ్, శ్రీలీలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ పాటలో దాదాపు 1500 మంది డాన్సర్లు పాల్గొంటున్నట్లు సమాచారం. 1500 మంది డాన్సర్ల మధ్య రామ్, శ్రీ లీలా కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నారట. ఇక ఈ పాటకి ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అవుతుందట. దీని తర్వాత మరో రెండు పాటలను చిత్రీకరించి.. జూన్ నెలాఖరు నాటికి షూటింగ్ మొత్తం ముగించనున్నట్లు తెలుస్తోంది.

ఇక దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈనెల 15వ తేదీ రామ్ పోతినేని పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఈ సినిమా నుండి గ్లిమ్స్ వీడియోని విడుదల చేయబోతున్నారు.ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో రామ్ ఉరమాస్ లుక్ లో అదరగొట్టేసాడు. మే 15 ఉదయం 11:25 నిమిషాలకు టీజర్ గ్లిమ్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఇదే రోజు రామ్ - పూరి జగన్నాథ్ ల సరికొత్త ప్రాజెక్ట్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: