నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలయ్య వరుసగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందినటు వంటి అఖండ మూవీ తోను , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ తోను పవర్ఫుల్ మాస్ బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇలా వరుసగా రెండు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలయ్య ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు  ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తుంది. కాజల్ అగర్వాల్మూవీ లో బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.  చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో బాలయ్య పాత్రకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో బాలయ్య లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ... లారీ డ్రైవర్ పాత్రలో బాలయ్య చాలా పవర్ఫుల్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: