ఒక సినిమా విడుదల చేయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాని ప్రమోట్ చేయడం మరోఎత్తు..ఇందులో భాగంగానే ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లను అయితే ఏర్పాటు చేస్తుంటారు.

అయితే ఇవన్నీ ఒకప్పటి మాట..ఇప్పుడు ట్రెండ్ అయితే మారింది. అందుకే, ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నారు. హీరో గోపీచంద్ రామబాణం ప్రమోషన్స్ లో భాగంగా పాల ప్యాకెట్ల మీద తన కొత్త సినిమా రామబాణం పోస్టర్లు వేసి ప్రమోట్ చేశాడటా.. ఇక విశ్వక్ సేన్ సైతం తన దాస్ కా ధమ్కీ ప్రమోషన్స్ లో భాగంగా వెయిటర్ గా మారి హోటల్ లో సందడి చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు ఇదే రూట్ ని ఫాలో చేసేస్తూ విజయ్ ఆంటోనీ తన బిచ్చగాడు 2 ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నాడటా...హైదరాబాద్ మణికొండలోని 1980 మిలటరీ హోటల్ లో విజయ్ ఆంటోని సందడి చేశాడని తెలుస్తుంది.. కస్టమర్స్ గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి వారికి స్వయంగా ఆయనే వడ్డించారు. కాసేపటికి అసలు సంగతి తెలుసుకున్న కస్టమర్స్ విజయ్ ఆంటోనిని చూసి ఆశ్చర్యపోయారటా.. స్వయంగా హీరో వడ్డించడం పై ఆనందం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ మూమెంట్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక గత శుక్రవారం విడుదలైన బిచ్చగాడు2 తొలుత మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా కానీ ప్రస్తుతం హిట్ దిశగా దూసుకుపోతోంది. మొదటి వారాంతం పూర్తయ్యే సరికి 80 శాతం బ్రేక్ ఈవెన్ సాధించిందటా.మరో 2-3 రోజుల్లో ఈ సినిమా బయ్యర్లకు లాభాలు అందించడం గ్యారెంటీ అని తెలుస్తుంది.ఇక ఇదే ఊపులో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు3ని కూడా ప్రకటించారు.

మొత్తంగా విడుదలకు ముందు ప్రచారాన్ని ఒక సంప్రదాయ పద్ధతిలో చేసినా…సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రచారాన్ని కొత్త దారులు తొక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కావ్య థాపర్‌ ఆనందంతో రెండు రోజుల క్రితం ఫారెస్ట్ లో తిరుగుతూ వైల్డ్ గా అందాల ప్రదర్శన కూడా చేసింది. ఉత్తరాఖండ్‌లోని జమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్ లో తిరుగుతూ కిర్రాక్ ఫోజులను ఇచ్చింది కావ్య థాపర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: