తమిళ టాలెంటెడ్ స్టార్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ తెరకెక్కించిన లేటెస్ట్‌ మూవీ విడుతలై. ఇప్పటి దాకా కమెడియన్‌గానే పరిచయమైన సూరీ ఈ సినిమాతో హీరోగా సూపర్ డూపర్ ఎంట్రీని ఇచ్చాడు.ఈ మూవీలో స్టార్ హీరో మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి పవర్‌ ఫుల్‌ క్యామియో రోల్‌లో కనిపించాడు. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ మార్చి 31న విడుదలైంది. సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో తెలుగులో కూడా విడుదల పార్ట్‌ 1 గా ఏప్రిల్ 15న రిలీజ్‌ చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా విడుదల చేసిన ఈ సినిమాకి ఇక్కడ కూడా కలెక్షన్లు భారీగా వచ్చాయి. థియేటర్లలో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న విడుతలై పార్ట్‌-1కు ఓటీటీలో కూడా మంచి వ్యూస్‌ వచ్చాయి. ఏప్రిల్ 28 వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది ఓన్లీ తమిళ్‌ వెర్షన్‌ మాత్రమే.


ఇటీవలే కన్నడ ఇంకా మలయాళ వెర్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే అసలు ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే తాజాగా తెలుగు వెర్షన్‌ విడుదల పార్ట్‌ 1కూడా ఓటీటీలోకి వచ్చేసింది.ప్రస్తుతం జీ 5 లోఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన విడుదల మూవీలో భవాని శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, ఇళవరసు, బాలాజీ శక్తివేల్ ఇంకా ఇతరులు కీలక పాత్రలు పోషిమంచారు. తమిళ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. కాగా విడుదల సినిమాకు కొనసాగింపుగా విడుదల 2 సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరగుతతోంది. త్వరలోనే ఈ మూవీ సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్‌ కూడా రానుంది. మరి థియేటర్లలో ఈ పోలీస్‌ యాక్షన్‌ డ్రామాను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి బాగా ఎంజాయ్‌ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: