‘ఆదిపురుష్’ ‘సాలార్’ ప్రాజెక్ట్ కె లాంటి భారీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. గోపీచంద్ తో మారుతి తీసిన ‘పక్కా కమర్షియల్’ మూవీ ఫెయిల్ అయినప్పటికీ మారుతి చెప్పిన కథకు ప్రభాస్ ఓకె చేయడం అతడి అభిమానులకు అంతుచిక్కని విషయంగా మారింది.

 

 

ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అన్న టైటిల్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఆ టైటిల్ ఫైనల్ కాదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. మారుతి మార్క్ కామెడీతో ఈమూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని లీకులు వస్తున్నాయి. ప్రభాస్ నుండి అతడి అభిమానులు ఇప్పటివరకు చూడని కామెడీ యాంగిల్ ను మారుతి ఈసినిమాలో చూపిస్తాదట. మళయాళ బ్యూటీ మాళవికా మోహన్ ఈసినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది.

 

 

ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ఈమూవీలో ప్రభాస్ లుంగీ గెటప్ లో కొంతసేపు కనిపిస్తూ తన మాస్ బాడీ లాంగ్వేజ్ తో హడావిడి చేస్తాడట. టాప్ హీరోల లుంగీ గెటప్ అంటే మాస్ ప్రేక్షకులకు ఒక విందు భోజనంలా ఉంటుంది. ఇప్పుడు ఆ సక్సస్ ఫార్మలాను మారుతి ప్రభాస్ పై ప్రయోగించబోతున్నాడు. అయితే ఇప్పటివరకు పెద్ద హీరోల సినిమాలను డీల్ చేసే విషయంలో అంతగా అనుభవంలేని మారుతి ప్రభాస్ పై చేస్తున్న ఈప్రయోగం ఎంతవరకు బాగుంటుంది అన్న సందేహాలు అభిమానులలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

ఈ పరిస్థితులు ఇలా ఉండగా ‘ఆదిపురుష్’ మూవీకి సంబంధించిన బిజినెస్ వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు అదేవిధంగా ప్రభాస్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతున్నారు. గతంలో ఈమూవీ టీజర్ కు నెగిటివ్ స్పందన వచ్చినప్పటికీ లేటెస్ట్ గా విడుదల అయిన ఈమూవీ ట్రైలర్ కు వచ్చిన స్పందనతో ‘ఆదిపురుష్’ పై రోజు రోజుకు అత్యంత భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: