యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందినటు వంటి "కే జీ ఎఫ్ చాప్టర్ 1" మరియు "చాప్టర్ 2" మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత నీల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. "కే జి ఎఫ్ చాప్టర్ 1" మరియు "చాప్టర్ 2" మూవీ లు బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించడంతో ఈ దర్శకుడి క్రేజ్ అమాంతం ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 31 వ మూవీ గా రూపొందనుండడంతో ఈ మూవీ ని ఎన్టీఆర్ 31 అనే పేరుతో ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఏకంగా ప్రశాంత్ 50 కోట్ల భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను పుచ్చుకోబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ ని కూడా ప్రశాంత్ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ మూవీ పూర్తి కాగానే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: