మహేష్ కు 50 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పటికీ అతడి మొఖం పై ఎక్కడా చిన్న ముడత కూడ కనిపించదు. ఇప్పటికీ రాజకుమారుడు లా మెరిసిపోతూనే ఉంటాడు. దీనికి తగ్గట్టుగానే తాను తీసుకునే డైట్ విషయంలో వర్కౌట్స్ విషయంలో మహేష్ చాల జాగ్రత్తలు తీసుకుంటాడు. శరీరానికి అలసట కలిగించే భారీ ఫైట్స్ అలాగే తన శరీరాన్ని సిక్స్ ప్యాక్ రూపంలో చూపెట్టడానికి అవసరమైన ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తినడానికి మహేష్ ఇష్టపడడు.


ఆమధ్య ‘మహర్షి’ సినిమాలో ఎండలో గేదెలను తోలుతూ వ్యవసాయం చేసే సీన్ తీస్తున్నప్పుడు మహేష్ ఎక్కడ అలసిపోతాడో అని ఎయిర్ కండిషన్ సెట్ వేసి అందులో గేదెలను తీసుకు వచ్చి మిగతా పల్లె వాతావరణాన్ని అంతా గ్రాఫిక్స్ తో కవర్ చేసారు అన్న వార్తలు కూడ వచ్చాయి. లేటెస్ట్ గా మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ఒక ఫైటింగ్ సీన్ కోసం త్రివిక్రమ్ ముంబాయ్ నుండి ఫైటర్స్ ను తెప్పించి భారీ ఫైట్ సీన్స్ చేయడానికి ప్రయత్నిస్తే అంత భారీ ఫైట్ సీన్స్ వద్దు అంటూ ఆ ఫైట్ సీన్స్ ను మహేష్ మార్చాడు అన్న గాసిప్పులు కూడ వచ్చాయి.


ఇప్పుడు మహేష్ త్వరలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. రాజమౌళి సినిమాలో నటించడం అంటే ఎంతటి టాప్ హీరో అయినా తన ఒళ్ళు హూనం చేసుకోవాలి. అయితే సుకుమారంగా ఉండే మహేష్ రాజమౌళి యాక్షన్ సీన్స్ కు తట్టుకోగలడా అంటూ వస్తున్న సందేహాలకు ఒక ఆసక్తికర సమాధానం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది.  



రాజమౌళి మహేష్ తో తీయబోయే సినిమా అంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో తీస్తారట. ఒక విధంగా ‘అవతార్’ టెక్నిక్ ను అనుసరిస్తూ ఒక యానిమేషన్ తరహా ఇమేజ్ లు మహేష్ కు సంబంధించి తయారీ చేసి మహేష్ ను 360 డిగ్రీస్ లో ప్రతి యాంగిల్లోంచి ఇమేజింగ్ చేసేస్తారట. అవసరమైన క్లోజప్పులు అన్నీ అతడి మీద అన్ని షూట్ చేసి లాంగ్ షాట్స్ ఎడ్వెంచర్ సీన్స్ ఫైట్స్ ఇలా అన్నీ మోషన్ క్యాప్చర్ టెక్నాలతో  తీస్తారట. ఈవార్తలే నిజం అయితే రాజమౌళి  సినిమా కోసం మహేష్  పెద్దగా కష్టపడవలసరంలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: