జూన్ 16న విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీకి సంబంధించిన లిరికల్ వీడియోకు ట్రైలర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఒక్కసారిగా ఈమూవీ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ‘జై శ్రీరామ్’ అంటూ ‘ఆదిపురుష్’ ధియేటర్లు కలక్షన్స్ తో హోరెత్తిపోతాయని ఆమూవీ బయ్యర్లు చాల ఆశలు పెట్టుకున్నారు.

 

 

అయితే ఈమూవీని ఒక హాలీవుడ్ మూవీ భయపెట్టే అవకాశం ఉంది అంటూ కొందరు అంచనాలు వేస్తున్నారు. అదేరోజు భారీ అంచనాలు ఉన్న హాలీవుడ్ మూవీ ‘ది ఫ్లాష్’ విడుదల కాబోతోంది. సూపర్ హీరో జానర్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బ్యాట్ మ్యాన్ కూడా ఉండటంతో వరల్డ్ వైడ్ గా ఈసినిమా గురించి చాల ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.

 

 

అమెరికా యూకె దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈసినిమాను కొన్ని వేల ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు. దీనితో ఓవర్సీస్ ప్రేక్షకులు అదేవిధంగా మనదేశంలోని మల్టీ ఫ్లెక్స్ ప్రేక్షకులు ఈసినిమాను మొదటి మూడు రోజులలోనే చూడాలని ప్రయత్నించే అవకాశం ఉంది. దీనికితోడు ‘ది ఫ్లాష్’ మూవీని ఏమాత్రం తక్కువ అంచనావేయలేమనీ దీనికితోడు ఈమూవీ ట్రైలర్ చూసిన వారు విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి అని కామెంట్స్ చేస్తూ ఉండటమే కాకుండా ఈసినిమాను ఫస్ట్ డే ధియేటర్లకు వెళ్ళి చూడవలసిందే అంటూ కామెంట్స్ పెడుతూ ఉండటంతో ఈ హాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ కలక్షన్స్ కు ఎంతమేరకు చెక్ పెడుతుంది అంటూ కొందరు అప్పుడే ఊహాగానాలు మొదలుపెట్టారు.

 

 

ఇండియాలో ఈ సమస్య అంతగా ఉండదు. ఇక్కడ ప్రభాస్ ఇమేజ్ కు ఫ్లాష్ అడ్డంకి కాదు. సరిపడా థియేటర్లు సులభంగా దొరుకుతాయి. ఎలాగూ పోటీ లేదు. రికార్డులు ఏ స్థాయిలో నమోదవుతాయో చూడాలి. అయితే ఈ హాలీవుడ్ మూవీ ఇండియాలో ‘ఆదిపురుష్’ కలక్షన్స్ కు చెక్ పెట్టలేదనీ ముఖ్యంగా రామాయణం కథ కాబట్టి ఈమూవీ పై అందరిలోనూ ఆశక్తి ఉంటుంది కాబట్టి ‘ఆదిపురుష్’ ఓపెనింగ్ కలక్షన్స్ కు ఎలాంటి సమస్య ఉండదు అని మరికొందరు అంటున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: