బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ఆది పురుష్.. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ముఖ్యంగా టీజర్ తో చాలా విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఇటీవల ట్రైలర్ విడుదల అవ్వడంతో అమాంతం మంచి హైప్ ని ఏర్పరచుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు లుక్ లో కనిపించగా ఇంకా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఇక రావణాసుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. వచ్చేనెల 16వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయగా నిన్న సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యి విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది.


అతి త్వరలోనే ఆది పురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తుగా తిరుపతిలో చేయబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతోంది.అదేమిటంటే ఇప్పటికే ఈ సినిమా పైన నెలకొన్న హైప్ కారణంగా థియేటర్ నాన్ థియేటర్ల్ రైట్స్ ఒక రేంజ్ లో పోటీపడ్డాయి.ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా థియేట్రీకల్ రైట్స్ ఏకంగా రూ.170 కోట్ల రూపాయలు దక్కించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా నైజాం ఏరియాకి రూ.80 కోట్ల దాకా డిమాండ్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల హక్కును ఒక పెద్ద నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. బాహుబలి టార్గెట్ గా వస్తున్న ఈ మూవీ బాహుబలిని బీట్ చేసి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: