నాచురల్ స్టార్ నాని తాజాగా పాన్ ఇండియా మూవీ అయినటు వంటి దసరా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి ముఖ్యంగా ఈ మూవీ లో నాని ... కీర్తి సురేష్ నటనలకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 

వీరిద్దరూ కూడా ఈ సినిమాలో చాలా సహజసిద్ధమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ తోనే దర్శకుడు గా తన కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను అందుకున్న ఈ సినిమా ఇప్పటికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు నుండే ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లోని పాటల ద్వారా కూడా సినిమా విడుదలకు ముందే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగి పోయాయి. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను "సరిగమ" సంస్థ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను తాజాగా విడుదల చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: