తాజాగా నటుడు నరేష్ పవిత్ర లోకేష్ కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా కంటెంట్ పరంగా అందరిని ఆకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది అని చెప్పాలి. ప్రేక్షకులను థియేటర్ కి రప్పించలేకపోయింది అని ఈ సినిమా కలెక్షన్లను చూస్తే అర్థమవుతుంది. అయితే నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ సినిమా టీజర్ ట్రైలర్లు విడుదలై ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాని 16 కోట్ల రూపాయలతో పెరకెక్కించినట్లుగా సమాచారం.

 చూస్తే ఆ రేంజ్ బడ్జెట్ అయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. సినిమా విడుదలైన తొలి రోజు  మోస్తారు ఓపెనింగ్స్ లభించాయి. మొదటి రోజు 45 లక్షల గ్రాస్ రెండవ రోజు 18 లక్షలు మూడవ రోజు 15 లక్షల గ్రాస్ కలెక్షన్స్ నమోదైనట్లుగా తెలుస్తుంది. మూడు రోజులు కలిపి ఈ సినిమా మొత్తం 78 లక్షల వసూళ్లను కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రతి సినిమాకు అగ్నిపరీక్షగా నిలిచే సోమవారం రోజున ఈ సినిమా విడుదలైంది .బాక్సాఫీస్ వద్ద చాలా దారుణమైన కలెక్షన్లను నమోదు చేసింది.అంతే కాదు చాలా థియేటర్లలో జనాలు రాకపోవడంతో ఆ థియేటర్ల నుండి సినిమాను కూడా

ఎత్తేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా విడుదలైన నాలుగవ రోజున కేవలం 10 శాతం కంటే తక్కువ ఆక్యుఫెన్సీ నమోదైనట్లుగా తెలుస్తుంది. నాలుగవ రోజు ఈ సినిమా చాలా తక్కువ కలెక్షన్స్ ను రాబట్టినట్లుగా తెలుస్తోంది .అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఐదు లక్షల మించి కలెక్షన్లను రాబట్ట లేకపోయిందని సమాచారం .దాంతో ఈ సినిమా థియేటర్లు దాదాపు ముగిసింది అని అంటున్నారు. ఈ సినిమా థియేట్రికల్ గా  బాగా నష్టాల్లో ఉందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా కన్నడలో అయితే అసలు ప్రభావం చూపలేకపోయింది అని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: