బాలకృష్ణ తో అఖండ సినిమాను నిర్మించిన ద్వారక క్రియేషన్ బ్యానర్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా తర్వాత ఈ బ్యానర్ లో కూడా పలు చిత్రాలు చేసేందుకు చాలా మంది బడ దర్శకులు స్టార్ హీరోలు సైతం బాగానే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ద్వారక క్రియేషన్ ఊహించని విధంగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో ఒక సినిమాను చేసేందుకు సిద్ధమయ్యింది.. ఈ కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఇదివరకే ఒకటాకు అయితే వినిపించింది. మొత్తానికి అధికారికంగా కూడా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది.
అయితే ఈ సినిమా టైటిల్ ఏమిటి నటీనటులు ఎవరు అనే విషయంపై మాత్రం కాస్త సస్పెన్స్ గాని కొనసాగుతోంది.. ఈ సినిమా జూన్ 2వ తేదీన ఉదయం 11: 39 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ టైటిల్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్లు మరకలతో ఆకట్టుకుంటున్న ఒక చేయి కనిపించడం జరుగుతోంది. ఇలా చూస్తూ ఉంటే మరొకసారి శ్రీకాంత్ అడ్డాల ఊహించని విధంగా సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

చివరిగా వెంకటేష్ తో నారప్ప సినిమాని రీమిక్స్ చేయడం జరిగింది.ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా  తాను సొంతంగా రాసుకున్న కథతోనే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం.  ద్వారక క్రియేషన్ ప్రొడక్షన్లో సినిమా వస్తోంది అంటే ఈ సినిమా హై వోల్టేజ్ స్టోరీ అన్నట్లుగా సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు అఖండ సినిమాతో భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న మిరియాల రవీందర్ రెడ్డి ఈసారి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అంటే జూన్ -2 వ తేదీ వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంతోనైనా శ్రీకాంత్ అడ్డాల కెరియర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: