తమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఎన్నో విజయాలను అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించిన సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తమిళ్ కంటే కూడా తెలుగు లో అద్భుతమైన విజయం సాధించింది. దానితో ఈ నటుడికి తెలుగు లో మంచి అవకాశాలు వచ్చాయి. 

అందులో భాగంగా ఈ నటుడు తెలుగు లో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఈ రెండు మూవీ లు అదిరిపోయే రేంజ్ విజయాలను సాధించడంతో ఒక్క సారిగా సిద్ధార్థ్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత తెలుగు లో ఈ నట్టుడి కి అనేక క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. కాకపోతే ఆ తర్వాత ఈ హీరో నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలను అందుకున్నాయి. ఆఖరుగా ఈ నటుడు మహా సముద్రం అనే సినిమాలో హీరోగా నటించాడు.

అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఈ నటుడు టక్కర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను జూన్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. కార్తీక్ జీ క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను థియేటర్ విడుదల తర్వాత నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: