
ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ గురించి ట్రెండీ ట్రాక్ బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా హిందీ లో ఈ సినిమా ఎన్ని కోట్లు సాధించే అవకాశం ఉంది అనే విషయం పైన పలు లెక్కలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్లో rrr సినిమా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అక్కడ తొలిరోజే రూ.19 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్ సాధించబోతున్నట్లు సమాచారం.
ఆది పురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంటో ఏర్పాట్లు కూడా తిరుపతిలో చాలా ఘనంగా చేస్తున్నారు. దాదాపుగా 200 మంది డాన్సర్లు గాయకులు భారీ బాణసంచాతో అంత సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి స్థాయిలో ఎక్కడ జరగనుంటి విధంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు సమాచారం. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏవిధంగా ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.. ప్రభాస్ ఏడాది చివరిలో సలార్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.