తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో నాగ చైతన్య ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో విజయవంతvమైన సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆఖరుగా చైతు "కస్టడీ" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందింది. అలాగే ఈ మూవీ రెండు భాషల్లో కూడా ఒకే రోజు మంచి ఆచనాల నడుమ విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది.

ఇలా కస్టడీ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ నటుడు ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక అద్భుతమైన స్టోరీని కూడా ఓకే చేసినట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలవడబోతునట్లు తెలుస్తుంది. నాగ చైతన్య తదుపరి మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. చైతు తన తదుపరి మూవీ ని కార్తికేయ 2 మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న చందూ ముండేటి దర్శకత్వంలో చేయబోతున్నట్లు ... ఈ మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చందు మండేటి ... నాగ చైతన్య కు ఒక సర్వైవల్ థ్రిల్లర్ కు సంబంధించిన కథను వినిపించినట్లు ... ఈ కథ చైతుకు అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ దర్శకుడు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: