పోయిన సంవత్సరం హిందీ సినీ పరిశ్రమ నుండి భారీ అంచనాల నడుమ బ్రహ్మాస్త్ర అనే భారీ బడ్జెట్ సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ కథానాయకులలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరోగా నటించగా ... అలియ భట్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయాన్ ముఖర్జీ ఈ భారీ బడ్జెట్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేశాడు.

ఇలా రాజమౌళి ఈ సినిమాను తెలుగు లో విడుదల చేయడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. బ్రహ్మాస్త్ర మూవీ మొత్తంగా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం బ్రహ్మాస్త్ర :  శివ ఇప్పటికే ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించడంతో ఈ మూవీ యొక్క మిగతా రెండు భాగాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన బ్రహ్మాస్త్రం తెలుగు వర్షన్ సినిమా తాజాగా బుల్లి తెరపై మొదటి సారి ప్రసారం అయింది. ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై తెలుగు లో స్టార్ మా చానల్లో ప్రసారం అయింది. అందులో భాగంగా ఈ మూవీ కి 6.56 "టి ఆర్ "పి రేటింగ్ లభించింది. డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ అంటే గొప్ప విషయమే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: