ఈమధ్య హీరోయిన్లు గ్లామర్ పరంగా మరింత అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందుకు హీరోలు కూడా అతీతం ఏం కాదు. ఎందుకంటే హీరోల్లో చాలామందికి ఇప్పటికే జుట్టు ఊడిపోయింది. దానికోసం హీరోలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. ఇక హీరోయిన్లు అయితే ముఖంతో పాటు బాడీలో కొన్ని పార్ట్స్ కి సర్జరీ చేయించుకుంటున్నారు. శృతిహాసన్, సమంత, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు ఇప్పటికే సర్జరీలు చేయించుకోవడం జరిగింది. తాజాగా ఈ లిస్టులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా చేరినట్లు తెలుస్తోంది. 'సవ్యసాచి' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా ఆరంగేట్రం చేసిన నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ సరసన 'మజ్ను' 

సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలతో రాని గుర్తింపు ఆ తర్వాత నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసి కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు తో పాటు మరోపక్క తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ ఇటీవల తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట. ఈ క్రమంలోనే రీసెంట్ గా తన పెదాలు మాత్రమే ఫోకస్ అయ్యేలా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిధి అగర్వాల్. ఆ ఫోటోలో పెదాలు లావుగా ఉన్నాయని,

అందుకే నిధి అగర్వాల్ తన పెదాలకు సర్జరీ చేయించుకుందనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అది నిజమేనని ఆమె స్వయంగా కన్ఫర్మ్ చేయలేదు. ఆమె పోస్ట్ చేసిన ఫోటోను బట్టి కొంతమంది నేటిజన్లు పెదాలకు సర్జరీ చేయించుకుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమందేమో ఇవన్నీ నీకు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా నీది అగర్వాల్ తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా లేదా అనేది తెలియాలంటే ఈ విషయంపై ఆమె స్పందిస్తే గాని ఏం చెప్పలేం. ఇక నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే మిగతా పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: