టాలీవుడ్ స్టార్ హీరోఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు చిత్ర బృందం. దేవర అనే టైటిల్ ని విడుదల చేస్తూ పోస్టురని సైతం విడుదల చేశారు. ఇక ఆ పోస్టర్ని చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ ఊర మాస్ గా  ఉంది. కాగా దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జాన్వి కపూర్ మరియు ఎన్టీఆర్ ల కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇదే.

దీంతో తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ పై ఒక ఆసక్తికరమైన రూమర్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ దుబాయ్ వెకేషన్ కి వెళ్లి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో జాన్వి పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు జాన్వి కపూర్ ఈ సినిమాలో మత్స్యకారుని కూతురుగా కనిపించబోతోంది అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని జాన్వి కపూర్ ట్రాప్ చేస్తుండట. తర్వాత ఆమె ఏజెంట్గా వెళ్లడవుతుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో ఈ సినిమా డైరెక్టర్ కొరటాల శివ జాన్వి పాత్రను చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారట. అందుకే జాన్వి కపూర్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చేసేందుకు జాన్వి కపూర్ భారీ రెమ్యూనరేషన్ సైతం తీసుకుందని అంటున్నారు. దేవర సినిమాలో నటించడానికి సుమారు నాలుగు కోట్ల వరకు రెమ్యూనిరేషన్ను తీసుకున్న జాన్వి కపూర్. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత మరికొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన చేసేందుకు రెడీ అయింది జాన్వి. తాజా సమాచారం మేరకు ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించేందుకు రెడీ అయిందని అంటున్నారు. అంతేకాదు అక్కినేని అఖిల్ సరసన కూడా నటించబోతోంది అని అంటున్నారు .ఈ క్రమంలోనే దేవర సినిమా తర్వాత ఆమెకి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: