
కేవలం బాలీవుడ్ లో కలెక్షన్లు ఎక్కువగా వస్తే చాలు ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయినట్టుగా భావిస్తూ ఉన్నారు. కానీ ఒక హీరో పాన్ ఇండియా స్టార్ హీరోగా పిలవాలనిపించుకుంటే కచ్చితంగా అతని సినిమాలు తెలుగు మరియు హిందీ, తమిళ్, మలయాళం, కర్ణాటక వంటి ప్రాంతాలలో కూడా విజయం సాధించాలి.. అలాంటప్పుడే ఆ చిత్రాలను పాన్ ఇండియా చిత్రాలని పిలుస్తూ ఉంటారట.. అయితే ఇప్పటివరకు ఇలాంటి వాటిలో సక్సెస్ అయిన దర్శకులలో డైరెక్టర్ ప్రశాంత్ నిల్, దర్శక ధీరుడు రాజమౌళి, డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించారు.
అయితే హీరోలు మాత్రం ఇలా చేయలేదని సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. కేవలం దర్శకులు మాత్రమే పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించారని తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నైనా తమ ఇతర సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో నటీనటులు సైతం పాపులారిటీ సంపాదించుకుంటారేమో చూడాలి మరి. ఈ మధ్యకాలంలో ఇతర సినిమాలను సైతం డబ్ చేసి పలు భాషలలో విడుదల చేసి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. బాలీవుడ్ సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నాయని చెప్పవచ్చు.