యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ రియాలిటీ షో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఈ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర ప్రేమికుల అభిమానాన్ని దోచుకుంది. అలా బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. 

అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ బ్యూటీ నాగ శౌర్య హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందిన "వరుడు కావలెను" సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇది ఇలా ఉంటే యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపును సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అనేక సార్లు వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలను హారిక స్కై బ్లూ కలర్ లో ఉన్న పలుచటి శారీ ని కట్టుకొని ... వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హారిక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: