మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు , కుష్బూ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. శ్రీ వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకు గోపీచంద్ ... శ్రీ వాసు కాంబినేషన్ లో లక్ష్యం , లౌక్యం అనే రెండు మూవీ లు రూపొంది ఆ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా కావడంతో రామబాణం మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు 14.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 15.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడంలో విఫలం అయింది. మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్ల కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ లో నైజాం ఏరియాలో 1.23 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ లో 60 లక్షలు , యూఏ లో 47 లక్షలు , ఈస్ట్ లో 36 లక్షలు , వేస్ట్ లో 21 లక్షలు ,  గుంటూరు లో 30 లక్షలు ,  కృష్ణ లో 32 లక్షలు ,  నెల్లూరు లో 18 లక్షలు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రనుగిసే సారికి 3.67 కోట్ల షేర్ ... 7.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

అలాగే కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని ఈ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 23 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 3.90 కోట్ల షేర్ ... 8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ సినిమాకు 11.30 కోట్ల నష్టాలు వచ్చాయి. దానితో ఈ మూవీ భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: