ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని మూవీలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాలను సాధించగా మరికొన్ని సినిమాలు పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి మంచి విజయాలను సాధించాయి. కాకపోతే ఈ సంవత్సరం ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమా ఏదో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్టేర్ వీరయ్య సినిమా ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదల అయిన అన్ని సినిమాలలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసి టాప్ స్థానంలో నిలిచింది. ఈ మూవీ లో శృతి హాసన్ , చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించగా ... ఆయనకు జోడిగా బ్యూటిఫుల్ నటి క్యాథరిన్ ఈ మూవీ లో నటించింది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ప్రకాష్ రాజ్ , బాబి సింహమూవీ లో విలన్ పాత్రలలో నటించారు. 

మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. అలాగే ఇప్పటి వరకు ఈ సంవత్సరం విడుదల అయిన టాలీవుడ్ సినిమాల్లో కూడా వాల్టేర్ వీరయ్య సినిమాలే అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసి టాప్ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: