పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించగా ... కృతి సనన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాను జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఫైనల్ ట్రైలర్ పేరుతో మరో వీడియోను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ వీడియో తెలుగు వర్షన్ కు 24 గంటల్లో 6.19 మిలియన్ వ్యూస్ ... 338 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ యొక్క ఫైనల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: