నటుడు డైరెక్టర్ సముద్రఖని, అనసూయ, మాస్టర్ ధ్రువ, మీరాజాస్మిన్, రాహుల్ రామకృష్ణ ధన్ రాజ్ తదితరులు కలిసి నటించిన తాజా చిత్రం విమానం.. ఈ చిత్రానికి నిమ్మకాయల ప్రసాద్ కిరణ్ కొర్రపాటి నిర్మాతలుగా వ్యవహరించారు. డైరెక్టర్ శివప్రసాద్ మానాల దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజున ఈ సినిమా విడుదలవ్వడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


అంగవైకల్యంతో పేదరికంతో బాధపడుతున్న వీరయ్య..(సముద్రఖని) కుమారుడు రాజు (మాస్టర్ ధృవన్) చిన్న వయసులోనే తల్లి మరణించడంతో వీరయ్య అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటాడు. వీరయ్యకు తోడుగా అదే కాలనీలో ఆటో నడుపుతూ (ధనరాజ్). చెప్పులు కుట్టుకునే వృత్తిలో ( రాహుల్ రామకృష్ణ)  ఉంటారు ఊహ తెలిసినప్పటి నుంచి వీరయ్య కుమారుడు రాజు విమానాలు అంటే ఇష్టమే కాకుండా దానిలో ప్రయాణించాలనే కోరిక ఉంటుంది విమానం ఎక్కించమని తండ్రి వీరయ్యను ప్రతిరోజు కోరుతూనే ఉంటాడు.

విమానం ఎక్కాలని కోరిక ఎందుకు కలిగింది పేదరికంతో బాధపడి వీరయ్య తన కొడుకుని విమానం ఎక్కించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు.. అనే విషయమే ఈ సినిమా కథ.. అదే కాలనీలో సుమతి (అనసూయ భరద్వాజ్) దేశ వృత్తిని కొనసాగిస్తూ ఉంటుంది..రాహుల్ రామకృష్ణ అనసూయను ప్రేమిస్తూ ఉంటారు అనసూయ ఆయన ప్రేమను అంగీకరించిందా విమానం ఎక్కాలని కోరికను వీరయ్య తీర్చాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..కొంతమంది ప్రేక్షకులు తెలిపిన ప్రకారం విమానం చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ తో మొదలవుతుందని.. మొదటి భాగం కథ కొంచెం నిదానంగా సాగిన సన్నివేశాలలో ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను కట్టి  పడేసేలా డైరెక్టర్ శివప్రసాద్ కథను రాసుకున్నారని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కొడుకు రాజుకు సంబంధించి ఒక క్లిష్టమైన సమస్య కథను మరింత ఎమోషనల్ గా చూపించారని తెలుస్తోంది అనసూయ రాహుల్ రామకృష్ణ ధన్రాజ్ ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయని తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా మంచి ఫీల్ ని నింపిందని తెలుస్తోంది. ఇందులో ప్రతి ఒక్కరి నటన పోటీపడి నటించారని తెలియజేస్తున్నారు. అనసూయ మరొకసారి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిందట

మరింత సమాచారం తెలుసుకోండి: