
విమానం ఎక్కాలని రాజు ఎందుకు కోరిక కలిగింది? పేదరికంతో బాధపడే వీరయ్య తన కొడుకును విమానం ఎక్కించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? జీవనాధారమైన సులబ్ కాంప్లెక్స్‌ను అధికారులు కూల్చివేస్తే వీరయ్య పోషణకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఉద్యోగం చేసే చోట వీరయ్య ఎలాంటి అవమానాలు, కష్టాలు అనుభవించాడు? కాలనీలో సుమతి (అనసూయ భరద్వాజ్) వేశ్యవృత్తిని ఎందుకు కొనసాగించింది? సుమతిపై చర్మకారుడు (రాహుల్ రామకృష్ణ) ఎందుకు మనసు పడ్డాడు? సుమతి తనను వెంటాడే చర్మకారుడిని ప్రేమను అంగీకరించిందా? విమానం ఎక్కాలనే కోరికను వీరయ్య తీర్చాడా? వీరయ్య, రాజు జీవిత ప్రయాణం ఎలా సాగిందనే ప్రశ్నలకు సమాధానమే విమానం సినిమా కథ.
విమానం చిత్ర కథ తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్‌తో భావోద్వేగంతో మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో కథ కొంచెం నిదానంగా సాగిందనే ఫీల్ కలిగించినా.. సన్నివేశాల్లో దట్టించిన ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుడిని కట్టిపడేసేలా దర్శకుడు శివ ప్రసాద్ రాసుకొన్న కథనం ఆకట్టుకొందని చెప్పవచ్చు. కొడుకు రాజుకు సంబంధించిన ఓ క్లిష్టమైన సమస్య కథను మరింత ఎమోషనల్‌గా మారుస్తుంది. అనసూయ, రాహుల్ రామకృష్ణ ఎపిసోడ్, ధన్ రాజ్ ఫ్యామిలీ సన్నివేశాలు సినిమాను వినోదంగాను.. కమర్షియల్‌గా మార్చే ప్రయత్నం చేసింది. ఫస్టాఫ్ కొంత స్లోగా సాగిందనిపించినప్పటికి.. మంచి ఫీల్‌ను మాత్రం నింపిందని చెప్పవచ్చు.ఇక సెకండాఫ్‌లో వీరయ్యను వెంటాడే సమస్యలు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అయితే మళ్లీ ఎమోషనల్ డ్రైవ్ సినిమాను నడిపించడంతో అలాంటి లోపాలు కనిపించకుండా ఉంటాయి. రాహుల్ రామకృష్ణ అఫైర్ విషయంలో అనసూయ రియలైజ్ అయ్యే సీన్ సినిమాకు ఓ హైలెట్‌గా నిలుస్తుంది. ఇక చివరి 20 నిమిషాలు సినిమా ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుందనడంలో ఎలాంటి సందేహమే లేదు.
తండ్రి, కొడుకుల అనుబంధానికి ఎమోషనల్ కంటెంట్ జొప్పించిన చిత్రం విమానం. లవ్, సెంటిమెంట్, భావోద్వేగాలను ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. కథ, కథనాలు ఊహించినట్టే ఉంటాయి. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్, ఇతర పాత్రల మధ్య ట్రావెల్ కథను మరింత ఎలివేట్ చేశాయి. చాలా సీన్లు హృదయాన్ని కదలించేలా ఉంటాయి. మరికొన్నిసార్లు కంటతడి పెట్టించేలా ఉంటాయి. మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన కమర్షియల్ సినిమా ఇది. థియేట్రికల్‌గా మంచి అనుభూతిని పండించే కథ, కథనాలు ఉన్నాయి. థియేటర్‌కు వెళ్లి చూస్తే మంచి ఫీలింగ్‌తో బయటకు రావడం గ్యారెంటీ.చివరగా ఐతే దీనికి గాను నేటిజన్స్ 3పాయింట్స్ ఇస్తున్నారు.