డైరెక్టర్ మహి వీ రాఘవ్ తెలుగు ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఆయన సినిమాలు ప్రేక్షకులకు కొత్తదనం చూపిస్తుంది.కామెడీ, రొమాంటిక్ డ్రామాలను తెరకెక్కించి ఆయన అలరించారు. అలాగే వైఎస్సార్ జీవితం ఆధారం 'యాత్ర' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మంచి హిట్ ను కూడా అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతుంటడం తో దర్శకుడు మహి కూడా వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.

ఈ క్రమంలో రీసెంట్ గా 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ తో సక్సెస్ ను అందుకున్నారు. మధ్య తరగతి భార్యభర్తల మధ్య జరిగే సన్నివేశాల తో సిరీస్ ను రూపొందించారు.. కామెడీ, ఎమోషన్స్ తో ఆడియెన్స్ ను బాగా మెప్పించారు. ఈ సిరీస్ తర్వాత కాస్తా రూటు మార్చి క్రైమ్ జోనర్ లో ఓ సిరీస్ ను ఆయన డైరెక్ట్ చేశారు. అదే 'సైతాన్'. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం కోసం రూపొందించారని తెలుస్తుంది..

తాజాగా సైతాన్ నుంచి ట్రైలర్ కూడా విడుదలైంది. పచ్చి బూతులు అలాగే బోల్డ్ సీన్స్ తో నింపేశారు. ఇప్పటికే 'రానా నాయుడు' సిరీస్ లో బూతులు వాడి సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. తర్వాత 'సైతాన్' అంతకు మించిన బూతులతో సంచలనంగా అయితే మారింది.వైలెన్స్ కూడా బాగా ఉండటం.. మహి నుంచి ఇలాంటి సిరీస్ రావడంతో రకరకాలుగా అయితే చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహి వి రాఘవ్ క్లారిటీ కూడా ఇచ్చారు.

మహి వీ రాఘవ్ మాట్లాడుతూ.. సైతాన్ సిరీస్ ఒక క్రైమ్ థ్రిల్లర్‌ అని దానిపై మూలాల్లోకి వెళ్లి రీసెర్చ్ కూడా చేశాం. ఓ క్రైమ్ చేసే వ్యక్తి శాంతంగా అయితే మాట్లాడడు కదా.. అతని చర్యలే కాదు అతని మాటలు కూడా చాలా వల్గర్‌గా ఉంటాయి. మనిషి పరిణామం చెందుతూ అయితే ఉంటాడు. ఈక్రమంలో ఎమోషన్స్ కూడా బాగా మారుతుంటాయి. ఇందులో బూతులు లేవని చెప్పడం లేదు.. కానీ అక్కడ అవసరమై వాడాము . దాన్ని నెగెటివ్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ సిరీస్ చూసిన తర్వాత  వైలెన్స్ కు దూరంగా ఉండాలనే భావన కూడా కలిగే అవకాశం ఉందనే కోణంలో అయితే ఆలోచించాలి. వచ్చే రిజల్ట్ ను బట్టి నెక్ట్స్ సీజన్ లో బూతులను మేము తగ్గిస్తాం అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: