ప్రజల కోసం డబ్బు ఆదా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు అలాగే పోస్టాఫీసులు కూడా కొత్త కొత్త స్కీం లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వీటి ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఇప్పుడు కూడా దేశీయ బీమా దిగ్గజం అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ పాలసీదారుల కోసం ఎన్నో రకాల సరికొత్త స్కీమ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో చిన్న పిల్లల వయసు నుంచి మొదలయ్యి పెద్దవాళ్ళ వరకి ఇన్వెస్ట్ ప్లాన్స్ ను ఎల్ఐసి తమ పాలసీదారులకు వేరు వేరు రకాల పాలసీల ను అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం..

ఈ పాలసీలు తీసుకోవడం వల్ల మనకు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఎల్ఐసి ప్రవేశపెట్టిన స్కీం లలో జీవన్ లక్ష్య పాలసీ కూడా ఒకటి. ఆర్థికంగా సహాయపడడానికి ఎన్నో కుటుంబాలకు ఈ స్కీమ్ చాలా చక్కగా పనిచేస్తుంది .ఇందులో 13 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు పాలసీలు చేరవచ్చు. అయితే పాలసీదారు ని యొక్క వయసు 18 సంవత్సరాలు తప్పకుండా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాల లోపు మాత్రమే ఉన్నప్పుడు ఈ పాలసీ వర్తిస్తుంది.

ఇందులో మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవడం తో పాటు, మీరు ఎన్ని సంవత్సరాలు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కూడా డిసైడ్ చేసుకునే అవకాశం ఇందులో కల్పించబడింది. టర్మ్ ప్రాతిపదికన మీరు చెల్లించే ప్రీమియం డబ్బులు కూడా ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి. ఇక ఇందులో 18 సంవత్సరాల వయసు కలిగిన వారు 10 లక్షల రూపాయల పాలసీ బీమా కోసం 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయడానికి తీసుకుంటే, మీరు రోజుకు 150 రూపాయల చొప్పున ఆదా చేయాల్సి ఉంటుంది.అంటే నెలకు 4,500 రూపాయలను ప్రీమియం చెల్లిస్తే , ఇక మెచ్యూరిటీ సమయం అంటే దాదాపుగా 20 సంవత్సరాలలో మీ చేతికి రూ.20 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది.


ఒకవేళ మీరు ఇందులో చేరాలనుకుంటే, మీ దగ్గరలోని ఎల్ఐసి బ్రాంచ్ ను సంప్రదించి పాలసీ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: