కేంద్రం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ను పెంచి ఒక శుభవార్త ని తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక తీపి కబురు తీసుకొచ్చింది. ఇకపోతే కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్థికంగా నష్టపోవడంతో వారి పిల్లలకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇందులో విఫలమైన కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఇప్పుడు ఈ డబ్బులు క్లైమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి అధికారిక డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు.

సెవెంత్ పే స్కేల్ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వంలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు , తమ పిల్లల కోసం ప్రతి నెల జీతభత్యాలను పొందుతారు ..అంటే నెలకు వారికి వచ్చే జీతంతో పాటు పిల్లల చదువుల కోసం కూడా  ఒక్కొక్కరికి 2,250 రూపాయలు అదనంగా కేంద్రం తమ ఉద్యోగులకు అందివ్వడానికి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ కరోనా  కారణంగా పోయిన సంవత్సరం నుండి అన్ని పాఠశాలలు మూసివేయబడ్డ విషయం తెలిసిందే . ఇక దీని కారణంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ డబ్బుల రూపంలో క్లైమ్ చేసుకోవచ్చు అని ప్రభుత్వ ఉద్యోగులకు తెలిపింది.

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అలాగే ఆఫీస్ ఆఫ్ మెమోరాండం ద్వారా జారీ చేసింది.. ఇక ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజులను ఆన్లైన్లో పాఠశాలలకు చెల్లించినప్పటికీ , విద్యార్థుల పరీక్ష ఫలితాలను ఎస్ఎంఎస్ లేదా  ఈమెయిల్ ద్వారా చూపించ లేదు అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. అంతే కాదు తల్లిదండ్రుల ఆర్థికంగా కూడా కొంచెం నష్టాన్ని చూసినట్లు కేంద్రానికి నివేదికలు సమర్పించారు.

ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పిల్లల విద్య కోసం , విద్యా భత్యం కూడా పొందవచ్చు అంటే ప్రతి బిడ్డకు నెలకు 2,250 రూపాయల చొప్పున ఇద్దరు పిల్లలు అయితే 4వేల 500 రూపాయలను ప్రతినెల పొందవచ్చు. అంటే ఈ అవకాశం ప్రభుత్వ ఉద్యోగుల ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. తమకు వచ్చే నెల వారి జీవితంతో పాటు పిల్లల కోసం విద్యా బత్యం కూడా నాలుగు వేల ఐదు వందలు రూపాయలు అదనంగా పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: