దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోని ప్రతి విభాగానికి కూడా ఎప్పటికప్పుడు వినూత్నమైన వివిధ రకాల పథకాలను అందజేస్తూనే వస్తుంది. ఇక ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడమే కాదు మీ పిల్లల చదువు, వివాహం , ఇతర ఖర్చులు , పదవీ విరమణ తదితర ఖర్చులకోసం ప్లాన్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే ఎల్ఐసి లో చాలా ప్రజాదారణ పొందిన ఒక పథకం గురించి ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది.

ఎల్ఐసి అందిస్తున్న ఈ పథకం పేరు న్యూ జీవన్ ఆనంద్ పాలసీ.. చాలా కాలంగా ఈ పాలసీని అమలు చేస్తున్న ఎల్ఐసి ఇప్పుడు దానికి కొత్త వర్షన్ను ప్రారంభించింది మరి ఈ కొత్త వెర్షన్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పథకంలో మీరు పొదుపుతో పాటు రక్షణను కూడా పొం.దవచ్చు ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో బలమైన రాబడితోపాటు మీరు పెట్టుబడికి రక్షణ కూడా లభిస్తుంది ఇక ఈ పాలసీ కింద పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయం తో కూడిన రాబడులు అలాగే అధిక ప్రయోజనాలు కూడా పొందుతారు. ఇందులో మీరు ఒక్కసారి చేరినట్లయితే 100 సంవత్సరాల పాటు పాలసీ కవరేజ్ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది

ఉదాహరణకు ఈ పాలసీలో కనీసం రూ.5 లక్షల హామీ మొత్తాన్ని పొందుతారు.  ఒకవేళ మీరు ఇందులో 35 సంవత్సరాల కాల పరిమితిని ఎంచుకుంటే ఈ పథకం కింద ప్రతి సంవత్సరం  రూ.16,300,  నెలవారీన రూ. 1358 రూపాయలను పెట్టుబడిగా పెట్టాలి అంటే రోజుకు కేవలం 45 రూపాయలను మాత్రమే మీరు పెట్టుబడి పెడితే నిర్నేత కాలం ముగిసేసరికి మీ ఆదాయం రూ.20 లక్షలకు పైగా అంటే 25 లక్షల రూపాయల వరకు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: