స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు ఎన్నో రకాల పొదుపు పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎస్బిఐ తీసుకొచ్చిన పథకాలలో ఎస్బిఐ యాన్యుటీ డిపాజిట్ స్కీం కూడా ఒకటి. ప్రతి నెల ఆదాయంగా కొంత డబ్బు పొందాలని భావించేవారికి ఈ పథకం చాలా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక ఈ పథకం యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

భారతదేశంలోని అతిపెద్ద రంగ బ్యాంక్ అయిన ఎస్బిఐ తాజాగా తీసుకొచ్చిన ఈ పథకంలో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసి నెలవారీగా పెన్షన్ రూపంలో ఆదాయం పొందవచ్చు. మనలో చాలామంది తమ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి ప్రతి నెల ఆదాయం పొందాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బయట వడ్డీలకు డబ్బు తిప్పడం అంతా సురక్షితం కాదు.. అలా అని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కాల పరిమితి ముగిసే వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇక ఎక్కడైనా పొదుపు చేద్దామంటే ఖచ్చితంగా రాబడి వస్తుందన్న హామీ కూడా లేదు.  ఇలాంటి ఎన్నో అనుమానాలు,  భయాల మధ్య డబ్బును జాగ్రత్త పరచడం కష్టమవుతుంది.

అందుకే నెలవారీగా ఆదాయం పొందాలని ఆశించే వారందరికీ ఇప్పుడు ఎస్బిఐ తీసుకొచ్చిన ఈ పథకం సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ పథకంలో ఒకేసారి పొదుపు చేసినవారికి తర్వాత నెల నుంచి పేమెంట్ రావడం మొదలవుతుంది. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ , వడ్డీ రేటు రెండు కలిపి లభిస్తాయి. మీరు కట్టిన మొత్తం సొమ్ములో కొంత భాగం వడ్డీ కలిపి ప్రతి నెల మీకు ఇన్స్టాల్మెంట్ గా మీ డబ్బులు లభిస్తుంది. పొదుపుదారులు మూడేళ్లు నుండి 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే స్కీం యొక్క వడ్డీరేట్లు టర్మ్ డిపాజిట్ వడ్డీరేట్లకు సమానంగా ఉంటాయి.ముఖ్యంగా మిగతా వారితో పోల్చుకుంటే సీనియర్ సిటిజనులకు ఈ పథకం అధిక వడ్డీను అందిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు 3.40% - 6.20% వడ్డీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: