ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నో ఆసక్తికర విషయాలు వైరల్గా మారిపోతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా కొన్ని ఘటనల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటూ ఉంటారు. ఏకంగా లగ్జరీ కంపెనీలకు సంబంధించిన వస్తువులు చూసినప్పుడు బాగానే అనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి ధర తెలిసినప్పుడు మాత్రమే నోరేళ్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఆ లగ్జరీ కంపెనీకి చెందిన వస్తువుల్లో అంత ధర పెట్టడానికి అసలు ఏముంది అని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఆలోచనలో పడిపోతూ ఉంటారు.


 ఇప్పుడు వరకు ఇలాంటి తరహా విషయాలు ఎన్నో సార్లు తెరమీదకి వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి ఒక వస్తువుకు సంబంధించిన వార్తా సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. ఇంటర్నెట్ జనాల దృష్టిని ఆకర్షిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వార్త దేని గురించో తెలుసా.. ఒక బ్యాగ్ గురించి పైన ఫోటోలో ఉన్న బ్యాగు చూడడానికి ఎంతో సాదాసీదా గానే కనిపిస్తుంది. కాగా ఇది పేపర్ తో తయారు చేసిన బాగ్ మహా అయితే పది నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది అని చెబుతారు ఎవరైనా.


 వంద రూపాయలకు మించి ఉండదు అని బల్లగుద్ది మరి చెప్పేస్తూ ఉంటారు. కానీ ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే మాత్రం నోరెళ్ళబెంతారు. ఏకంగా 2,80,000 రూపాయలు. ఈ మాట వింటేనే మైండ్ బ్లాక్ అయింది కదా.  లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ అయిన లూయిస్ విట్టన్ ఈ బ్యాగ్ ను తయారు చేసింది. ఈ బ్యాక్ పై లూయిస్ విటెన్, మై సన్ పాండియన్ 1854 అని రాసి ఉంటుంది. లోపల జిప్డ్ ప్యాకెట్, డబుల్ ఫ్లాట్ ప్యాకెట్ను అందించారు. యన్స్ క్రియేటివ్ డైరెక్టర్ పారెల్ విలియమ్స్ దీనినీ రూపొందించారు. 27 సెంటీమీటర్ల ఎత్తు 17 సెంటీమీటర్ల వెడల్పు 30 సెంటిమీటర్ల పొడవు ఉంటుంది ఈ బ్యాగు. ఇక ఈ బ్యాగ్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bag