రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీజర్ల విడుదల తర్వాత తలెత్తుతున్న సందేహాలివి. అల్లూరి సీతా రామరాజు కొమరం భీమ్‌ను కలపడం ఒక కల్పన. వారిద్దరూ ఒక దశలో ఇంటి నుంచి వెళ్లిపోయారనే కామన్ పాయింట్ తీసుకున్నామన్నారు. స్వతంత్ర పోరాటం ఇందులో వుండదని దర్శకుడు సినిమా చిత్రీకరణ మొదలు పెట్టకముందే చెప్పేశారు. అంటే యోధులుగా వారి ప్రసిద్ధి ఉపయోగిస్తూనే ఇతర అంశాలపై కేంద్రీకరణ వుంటుందన్న మాట.