సైఫ్ అలీ ఖాన్, ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అది తన ఉద్దేశం కాదని తెలియజేశారు. ఒక వేళ తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడి ఉంటే తనని క్షమించమని, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ విజ్ఞప్తి చేశారు. హిందువుల ఇష్టదైవం రాముడు అంటే నాకు కూడా చాలా ప్రీతి మరియు గౌరవం అని ఆయన అన్నారు . నా దృష్టిలో రాముడంటే ధర్మానికి మరియు వీరత్వానికి అద్దం వంటివారు అని పేర్కొన్నారు సైఫ్ అలీ ఖాన్. అటువంటి రాముని గురించి తాను తక్కువ చేసి మాట్లాడబోనని చెప్పారు.