టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ దళపతి, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం నిన్నటి రోజు నుంచి తమిళ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు విజయ్ కు వీర అభిమానిగా పరిచయమైన ఈమె ఆ తర్వాత ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహం చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయనకు దూరంగా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కనీసం మాట్లాడుకోలేదని సంగీత ఇప్పటికే అమెరికాలో ఒంటరిగా  ఉన్నదని వార్తలు వినిపిస్తున్నాయి.


ఒకప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోని ఆదర్శ జంటగా పేరు సంపాదించిన ఈ జంట ఇప్పుడు విడాకులు బాట పట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విడాకులకు ముఖ్య కారణం విజయ్ కి ఉన్న వివాహేతర సంబంధాలే అంటూ సంగీత వర్గం నుంచి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ ఇండస్ట్రీలో విజయ్ కి ఒకరిద్దరి హీరోయిన్లతో ఎఫైర్ రూమర్స్ ఏదో విధంగా నిరంతరం వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ తో కలిసి నటించిన ఒక స్టార్ హీరోయిన్, ఆయన ఉంటున్న ఏరియాలోని సొంతంగా ఇల్లు కొనుక్కోవడం వంటివి కూడా ఈ రూమర్స్ కి మరింత బలాన్ని చేకూర్చింది.


ఈ విషయం అటు సంగీతకి తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆమె విజయ్ తో విడిపోయి అమెరికాకు వెళ్లిపోయారని సమాచారం. విజయ్ కూడా ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నారు. విజయ్ స్టార్ హీరోయిన్ తో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. విజయ్ స్టార్ హీరోగా ఉన్నంతకాలం ఎవరూ కూడా ఈ వ్యవహారం పైన మాట్లాడే ధైర్యం చేయలేదు. ఎప్పుడైతే రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి పక్క పార్టీ నేతలు కూడా తన పర్సనల్ విషయాలను బయట పెట్టడం మొదలుపెట్టారు. ఇటీవలే ఒక బీజేపీ నేత స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అనంతరం ఆ హీరోయిన్ తనను రాజకీయ వివాదాలతో ముడి పెట్టవద్దు అంటు ఒక నోట్ విడుదల చేసింది. అయితే సంగీత విడాకులు కోరుతూ ఉండడంతో ఆ విషయం నిజమేననే వాదన ఇప్పుడు బలంగా నాటుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: