టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు.. మీనాక్షి చౌదరి! అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడు పుష్కలంగా ఉన్న ఈ భామ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కావడం లేదు. తన గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్‌తో బాలీవుడ్ మేకర్స్ కళ్లను కూడా కట్టిపడేసింది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ సరసన మీనాక్షి ఒక భారీ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ 'లక్కీ హీరోయిన్'గా పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌదరికి, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఎర్ర తివాచీ స్వాగతం లభిస్తోంది. అక్షయ్ కుమార్ నటించబోయే ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం మీనాక్షిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ సరసన నటించడమంటే అది మీనాక్షి కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్.ఇప్పటికే సౌత్‌లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ అమ్మడు, బాలీవుడ్ ఎంట్రీతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించబోతోంది.మీనాక్షి ప్రయాణం చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యమేస్తుంది. తక్కువ సమయంలోనే ఆమె టాప్ లీగ్ లోకి చేరిపోయింది.



'గుంటూరు కారం'లో శ్రీలీలతో పోటీ పడి తన ప్రత్యేకతను చాటుకుంది.'లక్కీ భాస్కర్'తో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ఆడియన్స్‌ను అలరించింది.విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ', 'మ్యాడ్ స్క్వేర్' లాంటి సినిమాలతో డైరీ మొత్తం ఫుల్ చేసేసింది.బాలీవుడ్‌లో అడుగుపెట్టడం అంటే కేవలం అందం ఉంటే సరిపోదు, అక్కడ గట్టి పోటీ ఉంటుంది. కానీ మీనాక్షికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఆమె హిందీ అనర్గళంగా మాట్లాడగలదు. దీనివల్ల డబ్బింగ్ సమస్య ఉండదు మరియు బాలీవుడ్ ఆడియన్స్‌కు సులభంగా కనెక్ట్ అయిపోతుంది. అక్షయ్ కుమార్ లాంటి స్పీడ్ ఉన్న హీరోతో మ్యాచ్ అవ్వడానికి మీనాక్షి పక్కాగా సెట్ అవుతుందని అక్కడి మేకర్స్ భావిస్తున్నారట.



మీనాక్షికి ఈ స్థాయిలో ఆఫర్లు రావడానికి ప్రధాన కారణం ఆమె ప్రొఫెషనలిజం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి పెద్ద సంస్థలు ఆమెను నమ్మి వరుసగా నాలుగైదు ఆఫర్లు ఇస్తున్నాయంటే, ఆమె పని తీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బాలీవుడ్ వైపు నుంచి కూడా పిలుపు రావడంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని టాక్.సౌత్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ హర్యానా భామ, ఇక నార్త్ బెల్ట్‌పై కూడా దండయాత్రకు సిద్ధమైంది. అక్షయ్ కుమార్‌తో చేయబోయే సినిమా హిట్ అయితే, ఇక మీనాక్షిని పట్టుకోవడం ఎవరి తరమూ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: