కన్నడ డైరెక్టర్ రోహిత్ పదకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో సాయి దుర్గా తేజ్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. 'సంబరాల ఏటి గట్టు' అనే పేరు వినడానికి క్లాస్‌గా ఉన్నా, సినిమాలో కంటెంట్ మాత్రం పక్కా ఊరమాస్‌గా ఉంటుందని తెలుస్తోంది.హనుమాన్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కోసం సాయి దుర్గా తేజ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశారు. గడ్డం, మాసిపోయిన బట్టలు, ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ చూస్తుంటే.. 'రంగస్థలం'లో చిట్టిబాబును మించిన పర్ఫార్మెన్స్ చూడబోతున్నామా? అనిపిస్తోంది. 'విరూపాక్ష'తో హారర్ థ్రిల్లర్ జోనర్‌లో హిట్ కొట్టిన తేజ్, ఇప్పుడు పీరియడ్ యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు.
ఈ 20 కోట్ల క్లైమాక్స్ వార్త బయటకు రాగానే మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. "మెగా హీరోలంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. స్క్రీన్ మీద విజువల్స్ పీక్స్‌లో ఉంటాయి" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ రేసులో ఈ సినిమాను నిలబెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ కోసం ఆడియన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ఇది అత్యంత కాస్ట్లీ మూవీ. క్లైమాక్స్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారంటే, ఇక సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి